హైదరాబాద్:
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విశాఖకు చెందిన టెక్కీగా గుర్తింపు
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని విశాఖపట్నానికి చెందిన రాజేశ్ (25)గా గుర్తించారు. ఆయన నగరంలోని నాచారంలో ఉన్న ఓ హాస్టల్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రోజున మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో ఉంటున్న తన మిత్రులను కలిసేందుకు వచ్చాడు.
Also Read - హైదరాబాద్‌లో భారీ శబ్దం.. ఉలిక్కిపడ్డ రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ స్థానికులు!
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణం
స్నేహితులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న రాజేశ్, ఉన్నట్టుండి బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాన్ని వెలికితీసేందుకు దుర్గం చెరువులో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), డీఆర్‌ఎఫ్ (DRF) బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
